Fri Nov 22 2024 22:02:48 GMT+0000 (Coordinated Universal Time)
పొలం పనులు చేసుకుంటుండగా వర్షం.. గుడిసె లోకి వెళ్లగా
తెలంగాణ రాష్ట్రంలో రైతులపై పిడుగు పడింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం
తెలంగాణ రాష్ట్రంలో రైతులపై పిడుగు పడింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం వంజరిగూడ గ్రామ శివారులో రైతులు పొలం పనుల్లో ఉండగా పిడుగు పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు రైతులు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం వంజరిగూడ గ్రామానికి చెందిన రైతులు పొలం పనులు చేసుకుంటుండగా పిడుగు పడింది.
పొలం పనులు చేసుకుంటున్న సమయంలో వర్షం ప్రారంభమైంది. దీంతో రైతులు పొలంలో ఏర్పాటు చేసిన ఓ గుడిసెలోకి వెళ్లారు. ఆ సమయంలో గుడిసెపై పిడుగుపడటంతో అందులో ఉన్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది బాధితులను జైనూర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడ నుండి ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంజరిగూడ గ్రామానికి చెందిన ముస్లే లక్ష్మణ్, కృష్ణా మస్లే, జ్యోతీ ముస్లే, ముండే సంగీత, ముండే విద్యా, కేంద్రే రామేశ్వర్ లు గాయపడ్డారు. వీరిలో కృష్ణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మిగిలిన వారు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఒకే రోజు పిడుగులు పడి ముగ్గురు చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గూడ గ్రామంలో పిడుగు పడి భర్త చనిపోగా, భార్య తీవ్రంగా గాయపడింది. పొలం పనుల కోసం వెళ్లిన భార్యాభర్తలు యాసీన్ (40) , హఫ్సానా వర్షం పడుతుండడంతో ఎద్దుల బండిపై ఇంటికి వస్తున్నారు. మార్గమధ్యలో వారిపై పిడుగు పడడంతో యాసీన్ అక్కడికక్కడే చనిపోయాడు. భార్య హఫ్సానా (38) తీవ్రంగా గాయపడింది. రెండు ఎడ్లు కూడా చనిపోయాయి. ములుగు జిల్లా మంగపేట మండలంలో మండలంలోని కొత్తూరు మొట్లగూడెం గ్రామ పరిధిలోని బొమ్మాయిగూడానికి చెందిన యువ రైతు ఈసం పవన్ కళ్యాణ్ (24 ) మొక్కజొన్న పంటకు కాపలాగా వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షం రావడంతో ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Next Story