Mon Dec 23 2024 02:30:52 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మీ వాహనం నెంబరు ప్లేట్ ను TS నుంచి TG కు మార్చాలా?
టీఎస్ ను టీజీగా మార్చాలన్న మంత్రివర్గ నిర్ణయంపై మార్గదర్శకాలను తెలంగాణ రవాణా శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు
టీఎస్ ను టీజీగా మార్చాలన్న మంత్రివర్గ నిర్ణయంపై మార్గదర్శకాలను తెలంగాణ రవాణా శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈరోజు, రేపు కొత్త మార్గదర్శకాలను రవాణా శాఖ విడుదల చేయనుంది. నెంబరు ప్లేట్ మార్చేందుకు వాహనదారులపై ఎలాంటి బారం పడకుండా ఉండేలా రవాణా శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
కొత్త వాహనాలకు మాత్రమే....
తెలంగాణలో ఉన్న 1.50 కోట్ల వాహనాలను టీఎస్ నుంచి టీజీ గా నెంబరు ప్లేట్ మార్చాల్సి ఉంటుంది. అయితే అలా కాకుండా ఇకపై రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే టీఎస్ ఇవ్వాలని రవాణా శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. రోజుు పది వేల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ కోసం వస్తున్నాయి. ప్రస్తుతం టీఎస్ గా ఉన్న వాహనాలకు నెంబరు ప్లేట్లు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఇప్పటికీ ఏపీ నెంబర్ ప్లేటుతో తెలంగాణలో పది వేల వాహనాలున్నాయి.
Next Story