Thu Dec 19 2024 12:49:42 GMT+0000 (Coordinated Universal Time)
బిడ్డకు పాలిస్తూ.. హార్ట్ అటాక్ తో చనిపోయిన మహిళ
వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన సుస్మిత
వయసుతో సంబంధం లేకుండా వస్తున్న గుండె పోటుల కారణంగా ఎంతో మంది హఠాత్తుగా ప్రాణాలను వదిలేస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు కూడా గుండెపోటుకు బలవుతున్నారు. ఇక యువత కూడా కార్డియోవాస్కులర్ సమస్యల కారణంగా ప్రాణాలు వదిలేస్తున్నారు. వరంగల్ లో తాజాగా ఓ బాలింత మరణం కన్నీళ్లు తెప్పిస్తోంది. నెలల బిడ్డకు పాలిస్తూ తల్లి గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన సుస్మిత అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. ఆగస్టు13న ప్రసవం కోసం వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో ఆమె చేరింది. ఆగస్టు16న ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలోని నియోనాటల్ కేర్ యూనిట్ (SNCU)లో చేర్చారు. శిశువుకు అక్కడ చికిత్స చేయిస్తుండగా, సుస్మిత సీమాంక్ వార్డులో శిశువుకు పాలిచ్చేది. ఎప్పటిలాగే ఆగస్టు 18న తెల్లవారుజామున 4 గంటలకు ఎస్ఎన్సీయూలో బిడ్డకు పాలుపట్టింది. ఆ తర్వాత పక్క వార్డులో నిద్రిస్తున్న ఆమె ఉదయం 6 గంటలైనా లేవలేదు. కుటుంబ సభ్యులు తట్టిలేపినా సుస్మిత స్పందించలేదు. వెంటనే వైద్యులు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే సీపీఆర్ చేసి బతికేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి.
Next Story