గల్ఫ్ లో డ్రగ్స్ ఉచ్చులో తెలంగాణ యువత
కఠినమైన చట్టాలు ఉండే గల్ఫ్ దేశాలలో తెలంగాణ యువత తెలిసీ తెలియక
గల్ఫ్ లో జైలు శిక్షలపై గల్ఫ్ జెఏసి నాయకుడు, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు గారి విశ్లేషణ
కఠినమైన చట్టాలు ఉండే గల్ఫ్ దేశాలలో తెలంగాణ యువత తెలిసీ తెలియక, అవగాహన లేకుండా డ్రగ్స్ ఉచ్చులో పడి జీవిత ఖైదు అనుభవిస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒళ్ళు నొప్పి మాత్రలు, గసగసాలు, మత్తు పదార్థాల సరఫరా రాకెట్ లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన 23 ఏళ్ల యువకుడు జనవరిలో మత్తు పదార్థాలు కేసులో అనుమానితుడిగా యూఏఈ దేశంలోని దుబాయిలో అరెస్టయ్యాడు. ప్రస్తుతం అబుదాబి లోని సుహాన్ సెంట్రల్ జైల్లో మగ్గుతూ విచారణను ఎదుర్కొంటున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన ఒక యువ ఇంజనీర్ జాతీయ భద్రతా కేసులో నాలుగేళ్ల క్రితం అరెస్టయి అబుదాబి జైల్లో మగ్గుతున్నాడు.
జెఏసి నాయకుడు, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు