Sun Dec 22 2024 18:33:01 GMT+0000 (Coordinated Universal Time)
బొత్స కుమారుడి పెళ్లిలో ప్రముఖులు, సెలబ్రిటీల సందడి
చిరంజీవి క్లాసిక్ లుక్ లో కనిపించగా.. బాలయ్య కుర్తాలో మెరిశారు. అలాగే నటుడు, జనసేన నేత నాగబాబు కూడా వివాహానికి హాజరై..
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనయుడు సందీప్ - పూజిత వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిందీ. ఈ వివాహానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీసమేతంగా ఈ వివాహానికి విచ్చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణలు కూడా పెళ్లిలో సందడి చేశారు.
చిరంజీవి క్లాసిక్ లుక్ లో కనిపించగా.. బాలయ్య కుర్తాలో మెరిశారు. అలాగే నటుడు, జనసేన నేత నాగబాబు కూడా వివాహానికి హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణకు చెందిన రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వధూవరులను ఆశీర్వదించారు. ఇక పెళ్లిలో నాగబాబు మాగుంట శ్రీనివాసులతో కాసేపు ముచ్చటించారు. ఇప్పుడు పార్టీలు వేరైనా.. మా శ్రీను అన్న నెల్లూరులో ఉన్నప్పటి నుంచి మాకు చాలా ఆత్మీయుడని చెప్పుకొచ్చారు నాగబాబు. "మా కాలేజీ రోజుల నుంచి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు. బొత్స సత్యనారాయణ కుమారుడి పెళ్లిలో ఆయనను కలవడం చాలా ఆనందంగా ఉంది" అని ట్వీట్ లో పేర్కొన్నారు.
Next Story