Mon Dec 23 2024 05:53:22 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : పదిహేను జిల్లాలకు రెడ్ అలర్ట్.. బయటకు వస్తే ఇక అంతేనట
తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని పదిహేను జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. పద్దెనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు పగటి వేళలో బయటకు వచ్చేందుకు కూడా భయపడిపోతున్నారు. దీంతో రోడ్లన్నీ హైదరాబాద్ నగరంలో నిర్మానుష్యంగా మారుతున్నాయి. కర్ఫ్యూ విధించినట్లు కనపడుతుంది.
తీవ్ర వడగాలులు...
భారీ ఉష్ణోగ్రతలతో పాటు తీవ్రస్థాయిలో వడగాలులు వీయడం కూడా ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఇంట్లో ఉన్నప్పటికీ ఉక్కపోతను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. గతంలో ఏ సీజన్ లో లేని విధంగా ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న తెలంగాణలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా గూడాపూర్ లో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయిందని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ ఉష్ణోగ్రతలతో...
అయితే భారీగా పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో పదిహేను జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి-కొత్తగూ డెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, హనుమకొండ, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఈనెల 6వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులు ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు కూడా జారీ చేసింది.
వాతావరణం శాఖ జారీ చేసిన ఉత్తర్వులు ఇక్కడ చూడగలరు.
Next Story