Mon Dec 23 2024 18:15:57 GMT+0000 (Coordinated Universal Time)
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. లాఠీఛార్జి
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. వీఆర్ఏలు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. వీఆర్ఏలు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వీఆర్ఏలు భారీగా తరలి రావడంతో ఉద్రిక్తత తలెత్తింది. అసెంబ్లీ వద్దకు వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద నుంచి అసెంబ్లీ వైపునకు వీఆర్ఏలు దూసుకు వచ్చారు.
ఏడు సంఘాలు....
దీంతో తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ వారు నినాదాలు చేస్తున్నారు. వీఆర్ఏ లతో పాటు ఉపాధ్యాయ సంఘాలు కూడా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. మొత్తం ఏడు సంఘాలు ఈరోజు అసెంబ్లీకి ముట్టడికి పిలుపు నివ్వడంతో పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. పేస్కేల్ అమలు చేయాలని, దీనికి సంబంధించిన జీవోలను విడుదల చేయాలని వీఆర్ఏలు కోరుతున్నారు.
Next Story