Thu Apr 17 2025 21:16:43 GMT+0000 (Coordinated Universal Time)
Mohan Babu : మోహన్ బాబు ఇంటివద్ద టెన్షన్.. మంచు మనోజ్ నిరసన
జల్ పల్లి లోని సినీనటుడు మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి

జల్ పల్లి లోని సినీనటుడు మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంచు మనోజ్ జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటివద్ద నిరసనకు దిగారు. తన వాహనాలతో పాటు విలువైన సామాగ్రిని నిన్న దొంగిలించారంటూ మంచు విష్ణుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా విడుదల చేశారు.
జల్ పల్లిలోని నివాసం వద్ద...
సీసీటీవీ పుటేజీని పరిశీలించిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈరోజు జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్దకు మంచు మనోజ్ వస్తున్నారని తెలిసి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దూరంలో చెక్ పోస్టును ఏర్పాటు చేసి ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. తన విలువైన వస్తువులను జల్ పల్లిలోని తన నివాసం నుంచి మాయమైపోయిన ఘటనపై మనోజ్ నిరసనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story