Mon Dec 23 2024 17:20:52 GMT+0000 (Coordinated Universal Time)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద టెన్షన్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్ఎస్యూఐ విద్యార్థులు రైల్వేస్టేషన్ లోకి చొచ్చుకెళ్లారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక్కసారి ఎన్ఎస్యూఐ విద్యార్థులు రైల్వేస్టేషన్ లోకి చొచ్చుకెళ్లారు. రైళ్లపై రాళ్లను రువ్వుతున్నారు. పట్టాలపై టైర్లు తగల బెట్టారు. రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను విద్యార్థులు ధ్వంసం చేశారు. రైల్వే పోలీసులతో పాటు, సివిల్ పోలీసులు కూడా ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుక ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల అద్దాలు
రైళ్లపై రాళ్లు విసురుతుండటంతో రైళ్లన్నంటినీ అధికారులు నిలిపి వేశారు. రాహుల్ గాంధీ ఈడీ విచారణకు, నిన్న కాంగ్రెస్ నేతలపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా ఎన్ఎస్యూఐ విద్యార్థులు ఈ ఆందోళనకు దిగినట్లు తెలిసింది. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు భయపడి పోయారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఐయూ అధ్యక్షుడు వెంకట్ తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story