Sun Dec 22 2024 14:35:45 GMT+0000 (Coordinated Universal Time)
Telangana tenth results 2024 : నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు
నేడు తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి.
Telangana tenth results 2024 :నేడు తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం పదకొండు గంటలకు పరీక్ష ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. ఈసారి తెలంగాణ వ్యాప్తంగా ఐదు లక్షల మంది వరకూ పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులతో పాటు వారి తల్లి దండ్రులు ఎదురు చూస్తున్నారు.
ఐదు లక్షల మంది వరకూ...
ఈరోజు పదో తరగతి ఫలితాలు విడుదలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసిన సమయంలోనే సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా అధికారులు వెల్లడించే అవకాశముంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలయిన నేపథ్యంలో కొంత ఆలస్యంగా తెలంగాణలో ఫలితాలను విడుదల చేస్తుండటంతో కొంత తల్లిదండ్రుల్లో అసంతృప్తి నెలకొంది. తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ స్కోర్ కార్డ్స్ ని bse.telangana.gov.inవెబ్ సైట్ లో లేదా bseresults.telangana.gov.in.లో నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.
Next Story