Telangana : నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పదవీకాలం ముగియడంతో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమయింది
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పదవీకాలం ముగియడంతో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమయింది. రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాలిటీలతో పాటు తొమ్మిది కార్పొరేషన్ల పదవీ కాలం నిన్నటితో ముగిసింది. దీంతో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమయినట్లు ప్రభుత్వం తెలిపింది. గవీటికి 2020 జనవరి 22వ తేదీన ఎన్నికు జరగ్గా అదే నెల 27వ తేదీన పాలకవర్గాలు బాధ్యతలను చేపట్టాయి.
పదవీకాలం ముగియడంతో...
పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈ కార్పరేషన్లకు, మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఈ నెల 28వ తేదీతో అంటే రేపటితో కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు కూడా ముగియనుంది. దీనికి కూడా ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించింది. నేటి నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది. తిరిగి ఎన్నికలు జరిగి పాలకవర్గాలు ఎన్నికై బాధ్యతలను చేపట్టేంత వరకూ అధికారులే పాలన వ్యవహారాలు చూసుకోనున్నారు.