Thu Oct 31 2024 07:20:51 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్షతో ఉద్యోగం
తెలంగాణలో నిరుద్యోగులకు దీపావళి రోజున టీజీపీఎస్సీ శుభవార్త చెప్పింది.
తెలంగాణలో నిరుద్యోగులకు దీపావళి రోజున టీజీపీఎస్సీ శుభవార్త చెప్పింది. తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. వచ్చే నెల 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. వచ్చే నెల పదో తేదీ నుంచి గ్రూప్ 3 హాల్ టిక్కట్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. గ్రూప్ 3పరీక్షల ద్వారా 1,388 పోస్టులను టీజీపీఎస్సీ భర్తీ చేయనుంది.
ఇంటర్వ్యూ లేదు...
వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి ఆ పోస్టులన్నీ భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్ 3 పరీక్షల్లో మత్తం మూడు పేపర్లుంటాయని టీజీ పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. ప్రతి పేపర్ లో 150 ప్రశ్నలుంటాయని, ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కును కేటాయిస్తామని తెలిపింి. అత్యథిక మార్కులు సాధించిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇక ఇంటర్వ్యూ లాంటిది ఏమీ ఉండదు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రశ్నాపత్రాలుంటాయి. అభ్యర్థులు ఎంపిక చేసుకునే భాషను బట్టి ప్రశ్నాపత్రాలను అందచేస్తారు.
Next Story