Mon Dec 23 2024 01:05:54 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. షెడ్యూల్ వచ్చేసింది
తెలంగాణలో నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూపు-2 పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది.
తెలంగాణలో నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూపు-2 పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. గ్రూపు 2 పరీక్షలను డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి గ్రూప్ 2 పరీక్షలు ఈ నెల 7, 8 తేదీల్లో జరగాల్సి ఉన్నా అభ్యర్థుల వినతి మేరకు దానిని ప్రభుత్వం వాయిదా వేసింది.
అభ్యర్థుల అభ్యంతరంతో....
ఈ సమయంలోనే డీఎస్సీ పరీక్షలు ఉండటంతో దీనిని వాయిదా వేయాలని కోరారు. రెండు పరీక్షలు వెంట వెంటనే ఉంటే తాము ప్రిపేర్ కావడం కష్టమని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరడంతో ఈ నెలలో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేశారు. గ్రూప్ 2 కింద మొత్తం 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. దాదాపు ఆరు లక్షల మంది ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారు.
Next Story