Tue Dec 17 2024 11:40:16 GMT+0000 (Coordinated Universal Time)
Bhadrachalam : రాములోరి కల్యాణం లైవ్ టెలికాస్ట్ ఉంటుందా? లేదా?
సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారం పై అనుమానాలు కలుగుతున్నాయి.
సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారం పై అనుమానాలు కలుగుతున్నాయి. ఏటా భద్రచాలం సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. దశాబ్దాలుగా లైవ్ టెలికాస్ట్ ను నిర్వహిస్తున్నారు. భద్రాచలం వెళ్లి సీతారాముల కల్యాణాన్ని చూడలేని భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చూసి రాములోరి కల్యాణాన్ని తరిస్తారు. అయితే ఈసారి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించడంపై నీలినీడలు అలుముకున్నాయి.
ఎన్నికల కోడ్ తో...
ఏటా భద్రాచలంలోని మిధిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాసిన లేఖకు ఇప్పటి వరకూ అనుమతి లభించలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. దేవాదాయశాఖ, సమాచార శాఖ సమన్వయంతో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తాయి. కన్నుల పండువుగా జరిగే కల్యాణాన్ని తిలకించేందుకు ఈసారి ప్రత్యక్ష ప్రసారం ఉంటుందా? లేదా? అన్నది నేడు తేలనుంది.
Next Story