Wed Jan 15 2025 22:58:55 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈరోజు ఉదయం ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈరోజు ఉదయం ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో వాహనాలన్నీ నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై ట్రక్కు బోల్లా పడటంతో వాహనాలను ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హయత్ నగర్ నుంచి లక్ష్మారిెడ్డి పాలెం వరకూ వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
ట్రక్కును తొలగించేందుకు...
అయితే వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని రహదారిపై ఉన్న ట్రక్కును తొలగించే చర్యను చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు నిలిచిపోవడంతో దాదాపు గంట సేపు రాకపోకలు నిలిచపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఉదయాన్నే విధులకు వెళ్లాల్సిన ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు ట్రాఫిక్ జాంలో చిక్కుకుపోయారు.
Next Story