Fri Nov 22 2024 15:06:01 GMT+0000 (Coordinated Universal Time)
Kamareddy : మున్సిపల్ ఛైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం
కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాసం నెగ్గింది. ఛైర్మన్ జాహ్నవి అవిశ్వాస తీర్మానంలో జరిగిన ఓటింగ్ లో నెగ్గలేదు.
కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాసం నెగ్గింది. మున్సిపల్ ఛైర్మన్ నిట్టు జాహ్నవి అవిశ్వాస తీర్మానంలో జరిగిన ఓటింగ్ లో నెగ్గలేదు. కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ జాహ్నవిపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం పెట్టింది. దీంతో అన్ని పార్టీలు తమ పార్టీలకు చెందిన సభ్యులను గోవాకు క్యాంప్ కు తరలించారు. నేరుగా ఈరోజు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి తీసుకు వచ్చారు.
కాంగ్రెస్ దక్కించుకునేందుకు...
అయితే ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో జాహ్నవి మున్సిపల్ ఛైర్మన్ పదవి కోల్పోయినట్లయింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ కు మద్దతివ్వడంతో పాటు బీజేపీ కౌన్సిలర్ లు ఈ ఓటింగ్ కు దూరంగా ఉండటం వల్లనే అవిశ్వాస తీర్మానం నెగ్గిందని పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసింది.
Next Story