Mon Dec 23 2024 12:30:55 GMT+0000 (Coordinated Universal Time)
కామారెడ్డి జిల్లాలో టెన్షన్.. అందరూ రాజీనామా
కామారెడ్డి జిల్లా అడ్లూరు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్ ముట్టడికి రైతులు పిలుపునిచ్చారు
కామారెడ్డి జిల్లా అడ్లూరు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మాస్టర్ ప్లాన్ ఛేంజ్ చేయడాన్ని రైతులు నిరసిస్తున్నారు. కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. తన భూమిని కోల్పోవడతో ఇటీవల రాములు అనే రైతు ఆత్మహత్యచేసుకున్నారు. దీంతో గ్రామ ఉపసర్పంచ్ తో పాటు తొమ్మిది మంది వార్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు.
కలెక్టరేట్ ముట్టడికి...
రైతులు అందరూ కలసి ఆందోళనకు దిగారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ నిరసనకు దిగారు. కలెక్టరేట్ ముట్టడికి రైతులు పిలుపు నిచ్చారు. ఇండ్రస్ట్రియల్ జోన్ తమకు వద్దంటూ వారు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ ఎత్తున బలగాలను మొహరించారు.
Next Story