Mon Dec 23 2024 15:46:18 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే పై హత్యాయత్నం
ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నానికి యత్నం జరిగింది. అనుమాతుడి నుంచి రెండుపిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఒక వ్యక్తి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఎమ్మెల్యే ఇంటి వద్ద ఒక అనుమానితుడు తిరుగుతుండటంతో అనుమానం వచ్చి సెక్యురిటీ పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి నుంచి రెండు పిస్టళ్లో తో పాటు ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు ప్రయత్నించాడని నిందితుడిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు.
కిల్లెడ సర్పంచ్ భర్త...
అయితే హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి కిల్లెడ సర్పంచ్ భర్త గా గుర్తించారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయించారని జీవన్ రెడ్డి పై కక్ష పెట్టుకున్న ఆ వ్యక్తి జీవన్ రెడ్డి హత్యకు ప్లాన్ చేశారని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story