Wed Dec 18 2024 10:18:59 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Assembly : అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం... తాగి పడిపోతున్నారంటూ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలతో సభ అట్టుడికిపోయింది
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలతో సభ అట్టుడికిపోయింది. హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరమంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కొంతమంది సభ్యులు మద్యం తాగి సభకు వస్తున్నారని, డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ లు చేయాలన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
తాగిపడుకున్న దెవరు?
ఫాం హౌస్ లో తాగి పడుకున్న దెవరు? విమానంలో ఎక్కుతూ తాగి పడిపోయింది ఎవరు? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లను దండుకుంది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు వసూలు చేసింది నువ్వు కాదా? అని హరీశ్ రావును ప్రశ్నించారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story