Mon Dec 23 2024 12:27:20 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో టెన్షన్....ఈటల కాన్వాయ్ పై రాళ్ల దాడి
మునుగోడులో ఉద్రిక్తత నెలకొంది.పలివెలలో రాళ్ల దాడి జరిగింది. ఈటల రాజేందర్ ప్రయాణిస్తున్న కారు పై రాళ్లదాడి జరిగింది
మునుగోడులో ఉద్రిక్తత నెలకొంది. మునుగోడు మండలం పలివెలలో రాళ్ల దాడి జరిగింది. ఈటల రాజేందర్ ప్రయాణిస్తున్న కారు పై రాళ్లదాడి జరిగింది. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాహాబాహీకి పాల్పడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
చివరి రోజు కావడంతో...
ప్రచారం చివరి రోజు కావడంతో అన్ని పార్టీలూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ధ్వంసమయిన వాహనాలను మునుగోడులోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి తీసుకు వచ్చారు. కొందరు బీజేపీ కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా గాయపడినట్లు తెలిసింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ దాడికి పాల్పడిందని ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టడంతో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉంది.
Next Story