Mon Dec 23 2024 07:17:08 GMT+0000 (Coordinated Universal Time)
ఒక్క రూపాయీ దొరకలే.. దొంగ అభినందనలు అందుకున్న బ్యాంకు
దొంగతనానికి వచ్చిన వాళ్లు ఏదో ఒక్కటి కాజేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక బ్యాంకులకు కన్నాలు
దొంగతనానికి వచ్చిన వాళ్లు ఏదో ఒక్కటి కాజేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక బ్యాంకులకు కన్నాలు వేసే వాళ్లు.. లక్షలు, కోట్లు కొల్లగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఓ దొంగ బ్యాంకును దోచేయాలని ఫిక్స్ అయ్యి వచ్చాడు. కానీ ఆ బ్యాంకులో ఒక్క రూపాయి కూడా లభించలేదు. దీంతో అతడు ఆ బ్యాంకు సిబ్బందిని అభినందించేసి.. ఓ నోట్ ను పెట్టేసి వెళ్ళిపోయాడు.
ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఓ దొంగ ప్లాన్ ప్రకారం వచ్చి మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టారు. ఆ తర్వాత లోపలికి వెళ్లి ఆ డెస్క్.. ఈ డెస్క్ అంటూ.. అన్నింటినీ వెతికేశాడు. స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్లాలని ప్రయత్నించినా అది జరగలేదు. ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కూడా చిల్లి గవ్వ దొరకకపోవడంతో బ్యాంకును అభినందించాడు. మంచిర్యాల జిల్లా నెన్నెలలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గురువారం రాత్రి చోరీకి విఫలయత్నం జరిగింది. మెయిన్ గేట్ తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగ స్ట్రాంగ్ రూం తెరుచుకోక పోవడంతో నిరాశగా వెనుదిరిగాడు. శుక్రవారం ఉదయం బ్యాంకు తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగిందని గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు బ్యాంకు వెనుక వైపు గోడ దూకి దొంగ బ్యాంకు ఆవరణలోకి వచ్చినట్టు గుర్తించారు. ముసుగు ధరించి లోపలికి వచ్చిన దొంగ చోరీకి ప్రయత్నించాడు. ఏమీ దోచుకెళ్లలేకపోయిన ఆ దొంగ ‘ నా ఫింగర్ ప్రింట్ కూడా ఉండదు. గుడ్ బ్యాంక్. ఒక్క రూపాయి దొరకలేదు. నన్ను పట్టుకోవద్దు’ అంటూ బ్యాంకు మేనేజర్ టేబుల్పై ఉన్న న్యూస్ పేపర్పై రాసి వెళ్ళిపోయాడు.
Next Story