Mon Dec 23 2024 08:54:30 GMT+0000 (Coordinated Universal Time)
గుండెపోటుతో మరణించిన మూడో తరగతి విద్యార్థి
వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి.. కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే..
పాఠశాలలో మధ్యాహ్న భోజనం క్యూలో నిలబడి మూడో తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. హృదయ విదారకమైన ఈ ఘటన అప్పర్ ప్రైమరీ స్కూల్లో జరిగింది. బోయిన్పల్లి మండలం వెంకట్రావుపల్లిలో మూడో తరగతి చదువుతున్న బుర్ర కౌశిక్ (8) అనే విద్యార్థి మంగళవారం మధ్యాహ్న భోజన క్యూ లైన్లో నిలబడి ఉన్నట్టుండి.. కుప్పకూలిపోయాడు.
వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి.. కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే కౌశిక్ అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే విద్యార్థి మరణించాడని వైద్యులు తెలిపారు. అంత పిన్న వయసులో విద్యార్థి గుండెపోటుతో మరణించడం టీచర్లను, స్థానికులను కలచివేసింది. కౌశిక్ మృతితో అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.
Next Story