Mon Dec 23 2024 02:21:12 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో రాహుల్ యాత్ర
తెలంగాణలో రాహుల్ గాంధీ మూడో రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభమయింది
తెలంగాణలో రాహుల్ గాంధీ మూడో రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభమయింది. పెద్ద చిన్నకుంట వద్దకు చేరుకున్న తర్వాత రాహుల్ టీ బ్రేక్ కోసం ఆగారు. మధ్యాహ్నం రెండు గంటలకు చేనేత కార్మికులు, పోడు భూముల రైతులతో రాహుల్ గాంధీ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
యాత్రలో నవంబరు1న ఖర్గే
గత నెల 7వ తేదీన రాహుల్ గాంధీ పాదయాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమయింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో పాదయాత్రను రాహుల్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న యాత్రకు మంచి స్పందన కనిపిస్తుంది. వచ్చే నెల 1వ తేదీన నూతనంగా ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే రాహుల్ పాదయాత్ర లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అధ్యక్షుడైన తర్వాత తొలిసారి ఖర్గే హైదరాబాద్ కు రానుండటంతో ఆయనకు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story