Fri Nov 22 2024 19:35:09 GMT+0000 (Coordinated Universal Time)
వ్యాక్సిన్ వేయించుకోలేదా ? రేషన్ , పెన్షన్ కట్
కోవిడ్ వ్యాక్సిన్ మొదటి, రెండు డోసులు వేయించుకోని వారు.. వెంటనే వేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయి
ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ మొదటి, రెండు డోసులు వేయించుకోని వారు.. వెంటనే వేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరించింది. ప్రభుత్వాల ఆదేశాలతో ఆరోగ్య కార్యకర్తలు ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్లు వేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇంకా వ్యాక్సిన్ వేయించుకోని వారికి రేషన్ , పెన్షన్ కట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో...
తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్ లో మెప్మా సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కరోనా రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకోకపోతే.. వారికి రేషన్, పెన్షన్ నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కోట్లాది మంది టీకాలు వేయించుకున్నారని, ఇప్పటికైనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఏదో అయిపోతుందన్న అపోహను వీడాలని ప్రచారం చేస్తున్నారు. వ్యాక్సినేషన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు రావని, భయపడకుండా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. వ్యాక్సినేషన్ ద్వారా వివిధ కరోనా వేరియంట్ల నుంచి ఉపశమనం ఉంటుందని, పాజిటివ్ వచ్చినా ప్రాణానికి ఎలాంటి ముప్పూ ఉండదని అవగాహన కల్పిస్తున్నారు
Next Story