Mon Dec 02 2024 03:51:57 GMT+0000 (Coordinated Universal Time)
టోల్‌ప్లాజా వద్ద వేలాది వాహనాలు
సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి సొంత వాహనాల్లో వేల సంఖ్యలో ఏపీకి బయలుదేరారు. దీంతో టోల్‌ప్లాజాల వద్ద రద్దీ పెరిగింది
విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్ నుంచి సొంత వాహనాల్లో ఆంధ్రప్రదేశ్ కు వేల సంఖ్యలో బయలుదేరారు. దీంతో టోల్‌ప్లాజాల వద్ద రద్దీ పెరిగింది. అయితే ఫాస్ట్ ట్యాగ్ సౌకర్యం ఉన్న వాహనాలను త్వరితగతిన పంపించేందుకు విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం 9 కౌంటర్లను తెరిచారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే కౌంటర్లను ఏడింటిని తెరిచి ఉంచారు. అయినా టోల్‌ప్లాజాల వద్ద రద్దీ కొనసాగుతుంది.
సంక్రాంతి రద్దీ.....
ఒక్కసారిగా వేల సంఖ్యలో వాహనాలు చేరుకోవడంతో టోల్‌ప్లాజా నిర్వాహకులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతుంది. లైన్ దాటి వాహనదారులు త్వరగా టోల్ గేట్ దాటాలన్న ఉత్సాహంతో ముందుకు వస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. టోల్‌ప్లాజా నిర్వాహకులు చేస్తున్న విజ్ఞప్తిని కూడా వాహనదారులు పట్టించుకోవడం లేదు. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకు నిర్వాహకులు అదనపు రుసుం వసూలు చేస్తుండటంతో గొడవలు జరుగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్య కోసం అక్కడ పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు.
Next Story