Mon Dec 23 2024 03:25:07 GMT+0000 (Coordinated Universal Time)
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. మూల మలుపులు, రోడ్డు ప్రమాదకరంగా ఉన్న ప్రదేశాల్లో పోలీసులు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
అంత్యక్రియలకు....
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట-జనగాం జాతీయ రహదారిలో లింగాల ఘనపురం మండలం వనపర్తి వద్ద జాతీయ రహాదారిపై టాటా ఏస్ ఆటో, కారు ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.టాటాఏస్ ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలవ్వగా.. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన జెన్ను చిన్నశేఖర్‌రెడ్డి, ధనలక్ష్మి, రఘునాధరెడ్డిగా గుర్తించారు.
Next Story