Mon Dec 23 2024 17:02:45 GMT+0000 (Coordinated Universal Time)
భద్రాద్రిలో ఘోర ప్రమాదం.. 4గురు మృతి, 8 మందికి గాయాలు
సుజాతనగర్‌కు చెందిన పలువురు కూలీలు అన్నపరెడ్డిపల్లి మండలానికి వరినారు తీసేందుకు బొలెరో వాహనంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. చంద్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాలీని బొగ్గులోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. సుజాతనగర్‌కు చెందిన పలువురు కూలీలు అన్నపరెడ్డిపల్లి మండలానికి వరినారు తీసేందుకు బొలెరో వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. మృతులు కత్తి స్వాతి (27), సుజాత (40), లక్ష్మి(52), సాయమ్మ(42)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాదంలో ట్రాలీ ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News Summary - Tipper Lorry Hits Bolero vehicle, four were died and 8 injured in bhadradri kothagudem district
Next Story