Fri Nov 22 2024 20:47:39 GMT+0000 (Coordinated Universal Time)
జూదం ఆడుతున్న సీఏ, ఏఎస్సై సహా 13 మంది అరెస్ట్
ఎర్రచందనం టాస్క్ఫోర్స్ సీఐ, ఓ ఏఎస్సైతోపాటు మరో 11 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.
కొందరు వ్యక్తులతో కలిసి ఒక ఇంట్లో పేకాడుతున్న సీఐ, ఏఎస్సై లను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం (ఏప్రిల్ 7) రాత్రి 13 మందినీ అరెస్ట్ చేయగా.. తాజాగా ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం రాఘవేంద్రనగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న కొందరు.. దానిని పేకాట స్థావరంగా మార్చేశారు. ఆ ఇంటిలో పేకాడుతున్నట్లు సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు పగడ్బందీగా దాడి చేశారు.
ఎర్రచందనం టాస్క్ఫోర్స్ సీఐ, ఓ ఏఎస్సైతోపాటు మరో 11 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో పోలీసులకు పట్టుబడినవారిలో అధికార పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్పీ పరమేశ్వరరెడ్డి జ్యోక్యం చేసుకోవడంతో అదే రోజు రాత్రి పట్టణంలోని తూర్పు పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న జోగారావు, కార్పొరేటర్ ఆంజనేయులు, మరో 9 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో నాగరాజు, డి.సురేశ్, కె.సురేష్, డి.కిరణ్ కుమార్, పి.కృష్ణారెడ్డి, బి.చెంచుముని, ఎన్.శ్రీనివాసులు, కె.మునిప్రసాద్, కె.రాధాకృష్ణ, కార్పొరేటర్ కె.ఆంజనేయులు, ఎస్.నరేంద్ర, ఏఎస్ఐ జోగారావు, సీఐ చంద్రశేఖర్ లు ఉన్నారు. అయినా ఈ కేసులో మరో ఇద్దరు ప్రజాప్రతినిధులను తప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Next Story