Mon Dec 23 2024 00:38:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీజేపీ నేతల దీక్ష
జాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ నేడు బీజేపీ హైదరాబాద్ లో నిరసన దీక్ష చేపట్టనుంది
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ నేడు బీజేపీ హైదరాబాద్ లో నిరసన దీక్ష చేపట్టనుంది. ముగ్గురి ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు నిరసనగా నేడు బీజేపీ దీక్ష కొనసాగుతుంది. ఇందిరా పార్కు వద్ద ఈ దీక్ష జరగనుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఈ దీక్షకు బీజేపీ నేతలు దిగనున్నారు. బీజేపీ చేపట్టిన ఈ దీక్షకు పోలీసులు అనుమతించారు. పోలీసుల అనుమతితో బీజేపీ నేతలు దీక్షకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ముగ్గురు ఎమ్మెల్యేల....
ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ లను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సమావేశాల తొలిరోజే బడ్జెట్ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ దే తుదినిర్ణయమని, అయితే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు స్పీకర్ దీనిపై పునరాలోచించాలని హైకోర్టు పేర్కొంది. స్పీకర్ ను కలిసినా సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో నేడు బీజేపీ నేతలు దీక్షకు దిగుతున్నారు.
Next Story