Fri Dec 27 2024 01:30:54 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైకోర్టులో బీఆర్ఎస్ కు భారీ షాక్
హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ల అనర్హత పిటిషన్ పై నేడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ల అనర్హత పిటిషన్ పై నేడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బిఆర్ ఎస్ పార్టీ పై గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన దానం, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి పై స్పీకర్ చర్యలు తీసుకునేలా అదేశాలు ఇవ్వాలని కోరుతూ బి ఆర్ ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పు చెప్పింది.
తీర్పును కొట్టివేసి...
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న సింగల్ పెంచ్ తీర్పును కొట్టివేసింది. స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని, అసెంబ్లీ ఐదేళ్ల గడువును దృష్టిలో పెట్టుకోవాలని హైకోర్టు సూచించింది.
Next Story