Tue Apr 08 2025 03:24:57 GMT+0000 (Coordinated Universal Time)
బుల్లెట్ పై అసెంబ్లీకి రాజాసింగ్
తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తున్నందుకు నిరసనగా ఈరోజు అసెంబ్లీకి బుల్లెట్ పై రాజాసింగ్ వచ్చారు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎప్పుడూ సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడంలోనూ ఆయన కొత్త పంథాలో నడుస్తుంటారు. ఆయనకు ప్రభుత్వం కేటాయించిని బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ చెడిపోతుంది. ఇబ్బంది పెడుతుంది. ఆయన నిన్న ప్రగతి భవన్ వద్దకు వెళ్లి తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వదిలేసి నిరసనను తెలియజేశారు. ప్రగతి భవన్ గేటు వద్ద వదిలేసి ఆయన తన నిరసన తెలిపి వెళ్లిపోయారు.
బుల్లెట్ ప్రూఫ్ వాహనం...
అయితే ఈరోజు తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తున్నందుకు నిరసనగా అసెంబ్లీకి బుల్లెట్ పై రాజాసింగ్ వచ్చారు. గేట్ నెంబరు 2 నుంచి ఆయన అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చారు. తనకు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకే తాను సొంత వాహనంపై అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యానని రాజాసింగ్ తెలిపారు.
Next Story