Mon Dec 23 2024 02:54:42 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సద్దుల బతుకమ్మ
నేడు తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి. ఈ నెల 14న ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి
నేడు తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి. ఈ నెల 14న ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నేడు సద్దుల బతుకమ్మ కావడంతో ఊరూ వాడల్లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. బతుకమ్మను ప్రభుత్వం అధికారిక పండగగా ప్రకటించడం, ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడంతో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు...
ఈరోజు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లను జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మను ఆడేందుకు తరలి వస్తారని అంచనాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎనిమిది రోజులుగా జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.
Next Story