Mon Dec 23 2024 13:40:01 GMT+0000 (Coordinated Universal Time)
నష్టం అంచనా పరిశీలన
నేడు ఆదిలాబాద్ జల్లా వరద ముంపు ప్రాంతాల్లోనూ కేంద్ర బృందం పర్యటిస్తుంది
నేడు ఆదిలాబాద్ జల్లా వరద ముంపు ప్రాంతాల్లోనూ కేంద్ర బృందం పర్యటిస్తుంది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వరదలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించనుంది. అలాగే భద్రాచలం లో కూడా నేడు కేంద్ర బృందం పర్యటించనుంది. అక్కడ అనేక కాలనీలు నీట మునిగాయి. నష్టం వివరాలను అంచనా వేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వ అధికారులకు స్థానిక అధికారులు సహకరిస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో....
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తోంది. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి తెలంగాణకు ఈ బృందం వచ్చింది. నిన్నటి నుంచే కేంద్ర బృందం తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పంటపొలలాలను పరిశీలించింది. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన బృందం పంట నష్టంతో పాటు దెబ్బతిన్న గృహాలను కూడా పరిశీలించింది. వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న గ్రామాల్లో పర్యటించి గ్రామస్థులను కలసి నష్టం వివరాలను అడిగి తెలుసుకుంటుంది.
Next Story