Sat Jan 11 2025 17:42:57 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే ఎర కేసు : నేడు తీర్పు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసు విషయంలో నేడు హైకోర్టు తీర్పు చెప్పనుంది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసు విషయంలో నేడు హైకోర్టు తీర్పు చెప్పనుంది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలా? లేదా? అన్న దానిపై నేడు స్పష్టత రానుంది. ఇప్పటికే చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనంలో వాదనలు పూర్తయ్యాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.
ఇరువర్గాల వాదనలు...
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై తమకు నమ్మకం లేదని నిందితులు పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై సింగిల్ బెంచ్ సీీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే డివిజన్ బెంచ్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తరుపున దుష్యంత్ దవే వాదించారు. ముఖ్యమంత్రి మీడియా సమావేశం వివరాలను వెల్లడించారన్న ఏకైక కారణంతో సీబీఐకి అప్పగించడమేంటని ప్రశ్నించారు. ఇది తగదని సూచించారు. ఇరువురు వాదనలు విన్న సీజే ధర్మాసనం గత నెల 30వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. నేడు దీనిపై తీర్పు చెప్పనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Next Story