Mon Jan 06 2025 22:40:15 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు విద్యాసంస్ధల బంద్
నేడు విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి
నేడు విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి. కుమురం భీం జిల్లాలో ఈరోజు విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి. కలుషిత ఆహారం తిని శైలజ మృతిచెందిన ఘటనకు నిరసనగా ఈ బంద్ ను చేపట్టనున్నట్లు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలన్నీ ఈరోజు బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి.
విద్యార్థి సంఘాల డిమాండ్లు...
శైలజ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని శైలజ అనే విద్యార్థి నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన నేపథ్యంలో వారు ఈ బంద్ కు పిలుపునిచ్చారు. శైలజ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు యాభై లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నేడు వాంకిడి మండలం బంద్ తో పాటు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలను బంద్ చేయాలని పిలుపు నిచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ను ఏర్పాటు చేశారు.
Next Story