Sun Dec 22 2024 13:31:36 GMT+0000 (Coordinated Universal Time)
మావో అగ్రనేత సుజాత అరెస్ట్
మావోయిస్టు అగ్రనేత కల్పన అలియాస్ సుజాత అరెస్టు అయ్యారు.
మావోయిస్టు అగ్రనేత కల్పన అలియాస్ సుజాత అరెస్టు అయ్యారు. మావోయిస్టు కీలక నేత సుజాతను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. చికిత్స కోసం కొత్తగూడెంలోని ఆస్పత్రికి వెళ్తుండగా తెలంగాణ పోలీసులు ఈరోజు ఉదయం ఆమెను అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో తెలంగాణ పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్లు తెలిసింది. మావోయిస్టుల ఆపరేషన్ల లో కీలక పాత్ర పోషించిన సుజాతపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో రూ.కోటి రూపాయలకిపై గా రివార్డు ఉంది. ప్రస్తుతం ఆమె బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
మోస్ట్ వాంటెడ్...
సుక్మా ప్రాంతంలో జరిగిన అనేక ఘటనల్లో ఆమె మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. మహబూబ్ నగర్‌కు చెందిన కల్పన అలియాస్ సుజాతను పోలీసులు విచారిస్తున్నారు. మావోయిస్టులకు సంబం ధించిన కీలక సమాచా రాన్ని ఆమె నుండి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో సుజాత పని చేశారు. కాగా ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. సుజాత అరెస్ట్ తో మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగిలింది.
Next Story