Mon Dec 23 2024 10:19:38 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ రెడ్డి అరెస్ట్
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఘటకేసర్ టోల్్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఘటకేసర్ టోల్్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తాను పోలీస్ స్టేషన్ కు రానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. దీంతో టోల్ గేట్ వద్దనే రేవంత్ రెడ్డి తన వాహనంలోనే నిరీక్షిస్తున్నారు.
వరంగల్ వెళుతుండగా...
నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీస్ కాల్పుల్లో చని పోయిన రాకేష్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వరంగల్ బయలు దేరి వెళుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి అక్కడకు వెళితే ఉద్రిక్తత చోటు చేసుకుంటుందని, అందుకే తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాకేష్ అంత్యక్రియల్లో పాల్గొంటే రాని ఉద్రిక్తత తాను వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఉద్రిక్తత తలెత్తుందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Next Story