Sun Mar 30 2025 04:01:20 GMT+0000 (Coordinated Universal Time)
కామారెడ్డిలో రేవంత్ పాదయాత్ర
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర 32వ రోజుకు చేరుకుంది. ఆయన ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర 32వ రోజుకు చేరుకుంది. ఆయన ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది. చిన్నమల్లారెడ్డిపల్లెలో పక్కా గృహాలను ఆయన పరిశీలించారు. బీడీ కార్మికులతో రేవంత్ రెడ్డి చర్చించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని వారికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కేటీఆర్ పాత్ర....
పేపర్ లీకేజీ లో మంత్రి కేటీఆర్ ఉన్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్త్రఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిడ్డ కోసం మంత్రులను ఢిల్లీకి పంపడమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. స్కామ్ లతోనే తెలంగాణ ప్రభుత్వం కాలం గడుపుతుందని ఆయన మండి పడ్డారు.
Next Story