Mon Dec 23 2024 15:08:55 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అరెస్ట్ !
ఓయూ గవర్నింగ్ కౌన్సిల్ రాహుల్ సభకు అనుమతి నిరాకరించింది. దాంతో ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు..
హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బంజారాహిల్స్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. మే 6,7 తేదీల్ల ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఓయూలో రాహుల్ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ.. ఓయూ గవర్నింగ్ కౌన్సిల్ రాహుల్ సభకు అనుమతి నిరాకరించింది. దాంతో ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతివ్వాలంటూ ఓయూ విద్యార్థులు నేడు మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించారు.
మినిస్టర్స్ క్వార్టర్స్ లోకి చొచ్చుకుని వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు విద్యార్థులందరినీ అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిలో ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు వెంకట్ కూడా ఉన్నారు. అరెస్టయి స్టేషన్ లో ఉన్న వెంకట్, ఓయూ విద్యార్థులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లగా.. సెక్షన్ 151 కింద ఆయనను కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.
Next Story