Sun Dec 22 2024 23:59:44 GMT+0000 (Coordinated Universal Time)
పల్లె బాట పట్టిన పట్టణం.. ట్రాఫిక్ జాం
సంక్రాంతి పండగ కోసం హైదరాబాద్ నుంచి సొంత వాహనాలలో బయలుదేరడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించింది.
సంక్రాంతి పండగ కోసం హైదరాబాద్ నుంచి సొంత వాహనాలలో బయలుదేరడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించింది. ప్రధానంగా టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువ కావడంతో పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒకే సమయంలో వాహనాలన్నీ టోల్గేట్ల వద్దకు చేరుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు చాలాసేపు నిలిచిపోయాయి.
ఫాస్ట్ ట్యాగ్....
ఫాస్ట్ ట్యాగ్ విధానం ఉన్నప్పటికీ వాహనాలు లెక్కకు మించి రావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. టోల్‌ప్లాజా నిర్వాహకులు ఎక్కువ గేట్లు విజయవాడ వైపు వెళ్లేవి తెరిచే ఉంచినా ఫలితం లేకుండా పోయింది. రాచకొండ పోలీసులు, టోల్‌ప్లాజా సిబ్బంది ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నా ఫలితం కన్పించడం లేదు. వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రయాణం గంటలు కూడా ఎక్కువ సమయం పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Next Story