Mon Jan 06 2025 22:20:57 GMT+0000 (Coordinated Universal Time)
National Highway : ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. తిరుగు ప్రయాణంలోనూ అంతే
జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మళ్లీ పెరిగింది. సంక్రాంతికి వెళ్లి తిరుగు ప్రయాణం కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది.
జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మళ్లీ పెరిగింది. సంక్రాంతికి వెళ్లిన ప్రయాణికులు తిరుగు ప్రయాణం కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సంక్రాంతి పండగను మూడు రోజుల పాటు జరుపుకుని సొంతూళ్ల నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరిన ప్రయాణికులతో జాతీయ రహదారి కిటకిటలాడుతుంది. ఈరోజు ఉదయం నుంచే వాహనాలు బారులు తీరాయి. టోల్ ప్లాజాల వద్ద విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ఎక్కువ టోల్ గేట్లు ఓపెన్ చేసినా రద్దీ మాత్రం ఆగలేదు.
మూడు రోజుల పాటు...
మూడు రోజుల సంక్రాంతి ముగియడంతో అందరూ ఈరోజే తిరిగి ప్రయాణం అయ్యారు. కనుమ రోజు బయలుదేర కూడదని భావించి అందరూ బుధవారమే వస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు పొగమంచు కూడా వాహనాల రాకపోకలపై ప్రభావం చూపుతుంది. వాహనాలు జాతీయ రహదారిపై నెమ్మదిగా సాగుతున్నాయి. ఉదయం నుంచే వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
Next Story