Wed Nov 27 2024 14:38:44 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుండి 12 వరకూ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
టూవీలర్స్, కార్లతో పాటు.. ప్రజారవాణా కోసం పనిచేసే బస్సులకూ డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు. వీలైనంత వరకూ ప్రజలు..
నేటి నుండి 12వ తేదీ వరకూ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఈ నెల 11 న ఎలక్ట్రిక్ కార్ రేస్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు ఎన్టీఆర్ మార్గ్ లో జరుగగనున్నాయి. అందుకే 6 రోజుల వరకూ ఎన్టీఆర్ మార్గ్ ను మూసివేశారు. ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
టూవీలర్స్, కార్లతో పాటు.. ప్రజారవాణా కోసం పనిచేసే బస్సులకూ డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు. వీలైనంత వరకూ ప్రజలు మెట్రో మార్గాన్ని వినియోగించుకోవాలని పోలీసులు కోరారు. లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ జంక్షన్, ఇగ్బాల్ మినార్ గుండా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. కాగా.. నూతన సచివాలయ పనులకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండదని, పనులు యథావిధిగా జరుగుతాయని పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది.
Next Story