Sun Jan 05 2025 07:23:29 GMT+0000 (Coordinated Universal Time)
మేడారం జాతరలో విషాదం
మేడారం జాతరలో విషాదం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించారు
మేడారం జాతరలో విషాదం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించారు. మేడారం జాతర నేటి నుంచి ప్రారంభమవుతుంది. గత కొద్ది రోజులుగా మేడారంలో భక్తుల తాకిడి పెరిగింది. దీంతో పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఘంబీరావుపేట కు చెందిన రమేష్ మేడారం జాతర విధులను నిర్వహిస్తుననారు.
కానిస్టేబుల్ మృతి.....
ప్రధాన జాతర స్థలం వద్ద ఆయన విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున రమేష్ గుండెపోటుకు గురయ్యారు. అక్కడే ఉన్న వైద్యులు చికిత్స చేసినా ఫలితం లేదు. కానిస్టేబుల్ మరణించడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు విషాదంలో మునిగిపోయారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
Next Story