Mon Dec 23 2024 11:19:00 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీకి రవాణాశాఖ షాక్.. తగ్గనున్న ఆర్టీసీ బస్సులు
ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్.. సంస్థలో ఉన్న బస్సులు, వాటి కండిషన్ పై 97 డిపోల వారీగా రివ్యూ నిర్వహించినట్లు తెలుస్తోంది..
హైదరాబాద్ : ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి రవాణా శాఖ మరో షాకిచ్చింది. నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన బస్సులను నడపరాదని రవాణాశాఖ ఆర్టీసీకి నోటీసులివ్వడంతో.. బస్సుల సంఖ్య భారీగా తగ్గిపోనుంది. గతేడాది లెక్కల ప్రకారం 97 డిపోల పరిధిలో 9,708 బస్సులు తిరగ్గా.. వాటిలో 3,107 అద్దెబస్సులున్నాయి. ఇప్పుడు కాలం చెల్లిన 600 బస్సులను పక్కన పెట్టాల్సి ఉంది. వాటిస్థానంలో 500 ఎలక్ట్రిక్ బస్సును అద్దెకు తీసుకోవాలని ఆర్టీసీ ఓ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్.. సంస్థలో ఉన్న బస్సులు, వాటి కండిషన్ పై 97 డిపోల వారీగా రివ్యూ నిర్వహించినట్లు తెలుస్తోంది. మొత్తం 97 డిపోల వారీగా బస్సులు, తిరుగుతున్న రూట్లు, సిబ్బంది, ఆదాయం, నష్టంతో పాటుగా డిపోకు ఉన్న భూముల గురించి సమగ్రంగా వివరాలు సేకరించినట్టు సమాచారం. సజ్జనార్ రివ్యూ చేసిన 97 డిపోలు నష్టాల్లోనే ఉన్నాయని, కొన్నింటిలో మూడింతలు నష్టాలున్నట్లు తేలింది. దాంతో మొదట కొన్ని డిపోలను మూసివేసి, ఆయా డిపోల్లో సిబ్బందిని వేరే డిపోలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.
Next Story