Mon Dec 23 2024 14:56:00 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిలాబాద్ లో భూ ప్రకంపనలు.. ఆరుబయట జాగారం చేసిన ప్రజలు
ఆదిలాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలకేంద్రంలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.
భూకంపం ఉట్నూర్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉందని, రిచర్ స్కేల్పై భూకంపం తీవ్రత 3.0గా నమోదైందని, ఆ ప్రాంతంలో ఇది రెండోసారి అని అధికారులు తెలిపారు. ప్రకంపనలు రావడంతో భయంతో జనం ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చారు. స్థానికులు మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి 11:23 నిమిషాలకు మూడు సెకన్ల పాటు కంపించినట్లు తెలిపారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా భవనం కంపించినట్లు అనిపించిందని.. అందుకే భయంతో బయటకు పరుగులు తీశామని స్థానికులు చెబుతున్నారు. మళ్లీ ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే భయంతో రాత్రంతా జాగారం చేశారు.
Next Story