Thu Dec 19 2024 03:50:47 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నేడు విచారణ
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో విచారణ నేడు కూడా హైకోర్టులో కొనసాగనుంది. ఈ కేసులో నిన్న సుదీర్ఘంగా విచారణ కొనసాగింది.
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో విచారణ నేడు కూడా హైకోర్టులో కొనసాగనుంది. ఈ కేసులో నిన్న సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించడంపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. దీనిపై న్యాయస్థానం ఇరువర్గాల వాదనలను విననుంది.
లేఖ రాసిన సీబీఐ
కాగా సీబీఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం వద్ద సేకరించిన ఆధారాలను తమకు ఇవ్వాలని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు విచారణ ఈరోజు కూడా జరగనుండటంతో విచారణ పూర్తయిన తర్వాతనే ఆధారాలను సీబీఐకి అప్పగించే అవకాశాలున్నాయి.
Next Story