Mon Dec 23 2024 10:20:23 GMT+0000 (Coordinated Universal Time)
ఎక్కువసేపు స్నానం చేస్తున్నారని.. బాలికల బాత్ రూమ్ లోకి పీఈటీ
ఓ మహిళా పీఈటీ పిల్లల మీద విచక్షణారహితంగా దాడి చేసింది. బాలికలు బాత్ రూమ్ లో ఎక్కువసేపు ఉంటున్నారని,
ఓ మహిళా పీఈటీ పిల్లల మీద విచక్షణారహితంగా దాడి చేసింది. బాలికలు బాత్ రూమ్ లో ఎక్కువసేపు ఉంటున్నారని, ఎంతసేపటికీ బయటకు రావడం లేదన్న కోపంతో బాత్రూం డోర్లు పగులగొట్టి, స్నానపు గదుల్లోకి వెళ్ళిపోయింది. సెల్‌ఫోన్‌తో వీడియోలు తీస్తూ కర్రతో చితకబాదింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలోని తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాలలో జరిగింది. కళాశాల నుంచి బయటకొచ్చిన బాలికలు బద్దెనపల్లిలోని సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. పీఈటీని సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు.
ఎంఈవో రఘుపతి అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వెంటనే డీఈవో రమేశ్‌కుమార్‌తో మాట్లాడారు. పీఈటీ జ్యోత్స్నను విధుల నుండి తొలగించాలని కలెక్టర్ ఆదేశించారన్నారు. ఎంఈవో రఘుపతి జ్యోత్స్నను తొలగించామని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. గిరిజన సంక్షేమ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝూ సందర్శించారు. పాఠశాలలో సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడారు.

Next Story