Sat Dec 28 2024 21:15:27 GMT+0000 (Coordinated Universal Time)
సొంత ఊర్లోనే కూసుకుంట్లకు దెబ్బ
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామంలో బీజేపీకి ఆధిక్యత లభించింది
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామంలో బీజేపీకి ఆధిక్యత లభించింది. లింగవారి గూడెం కూసుకంట్ల సొంత గ్రామం. ఆ గ్రామంలోనూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మెజారిటీ రావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తొలి నుంచి అభ్యర్థి ఎంపిక పట్ల అభ్యంతరాలు పార్టీలో వ్యక్తమయ్యాయి. అయినా సర్వేల్లో కూసుకుంట్లకే ఎక్కువ అనుకూలత లభించిందని టీఆర్ఎస్ అతనికే టిక్కెట్ ఇచ్చింది.
పుంజుకుంటామని...
అయితే అనేక మంది టీఆర్ఎస్ నేతల సొంత గ్రామాల్లో వెనుకంజ పడినా తర్వాత క్రమంగా పుంజుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కారు పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయని చివరకు తమదే విజయమన్న ధీమాను టీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. మొత్తం మీద మునుగోడులో హోరా హోరీ పోరు సాగుతుంది. ఐదో రౌండ్ ముగిసే సరికి బీజేపీ 400 ఓట్ల మెజారిటీతో ఉంది.
Next Story