Sun Dec 22 2024 20:49:28 GMT+0000 (Coordinated Universal Time)
టీఆర్ఎస్ కు ఆ పదవులు కట్
పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్ కు చోటు దక్కలేదు. ఆ పార్టీకి చెందిన ఎంపీల ఛైర్మన్ పదవులను కేంద్రం తొలగించింది.
పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్ కు చోటు దక్కలేదు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు కె కేశవరావు, నామా నాగేశ్వరరావుల ఛైర్మన్ పదవులను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. టీఆర్ఎస్ కు పార్లమెంటు ఉభయ సభల్లో పదహారు మంది సభ్యులున్నా ఎలంటి పదవులు కేటాయించలేదు.
కమిటీ సభ్యులుగానే....
పరిశ్రమల శాఖ కమిటీ ఛైర్మన్ గా కేశవరావు ఆ కమిటీలో సభ్యుడిగా కొనసాగనున్నారు. లైబ్రరీ కమిటీ ఛైర్మన్ గా ఉన్న నామా నాగేశ్వరరావు ఆ కమిటీలో సభ్యుడిగానే ఉంటారు. పార్లమెంంటు కమిటీలను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వివక్షపూరితంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
- Tags
- trs
- parliament
Next Story