Sun Dec 22 2024 15:04:35 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడు టీఆర్ఎస్ దే
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దాదాపు 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 13 రౌండ్లలో టీఆర్ఎస్ దే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కూసుకుంట్లకు 89 వేల ఓట్లు రాగా, బీజేపీకి 79 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఏడు మండలాల్లో...
దీంతో మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించగా, బీజేపీ రెండో స్థానంలో ఉంది. ఇక జాతీయ పార్టీ కాంగ్రెస్ మూడో స్థానంలో ఉండటమే కాకుండా డిపాజిట్ కోల్పోయింది. దీంతో టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మునుగోడులోని ఏడు మండలాల్లో టీఆర్ఎస్ కే ఆధిక్యత లభించింది.
Next Story